ETV Bharat / city

నవతరం హరిదాసు... నయా గెటప్ సూపర్..! - నవతరం హరిదాసు తాజా వార్తలు

సంక్రాంతి అంటే... ముగ్గులు, గొబ్బెమ్మలు, కోళ్ల పందేలు, పిండివంటలు, యువతుల నృత్యాలు ఇందంతా పండగ. ఆ పండగకు ప్రాణం పోసేది మాత్రం హరిదాసే. తను లేకుంటే... పండగ లాగానే ఉండదు. అందుకనే సంప్రదాయాలను మర్చిపోకుండా... ఓ నయా హరిదాసు దర్శనమిస్తున్నాడు.

hitech-haridas-in-east-godavari
నవతరం హరిదాసు... నయా గెటప్ సూపర్..!
author img

By

Published : Jan 4, 2020, 11:30 PM IST

సంక్రాంతి పర్వదినాన పూర్వంలో వేకువజామునే హరిదాసు ఊర్లోకి వచ్చి, నెత్తిన అక్షయపాత్ర, ఓ చేతిలో చిడతలు, మరో చేతిలో తంబూర పట్టుకొని భక్తిరస హరి కీర్తనలతో భిక్షాటన చేస్తూ ఉండేవారు. దానం స్వీకరించే సమయంలో హరిదాసు వినమ్రంగా క్రిందకి వంగి నెత్తి అక్షయ పాత్రలో దాన్ని స్వీకరించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. కానీ ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, రాజానగరం నియోజకవర్గంలో సరికొత్త భిక్షాటనకు శ్రీకారం చుట్టారు హరిదాసులు.

నవతరం హరిదాసు... నయా గెటప్ సూపర్..!

ఇప్పుడంతా హైటెక్ కాలం. వీధీ..వీధీనా నడిచే పనిలేకుండా నెత్తిన అక్షయ పాత్ర మోయకుండా హరి కీర్తన సైతం పాడకుండా కొత్త విధానానికి తెరలేపారు. తలపై ఉండాల్సిన అక్షయపాత్రను బైక్ హెడ్ లైట్ వద్ద అమర్చుకొని... తీరిగ్గా కూర్చొని ఇళ్లిల్లు తిరుగుతూ... నోటికి పని చెప్పకుండా టేప్ రికార్డుకు సౌండ్ బాక్సులు పెట్టేసి హరికీర్తనను ఓ రేంజ్​లో వినిపిస్తున్నారు.

తరతరాలుగా సంప్రదాయాలను కాపాడుకునేందుకు ఈ వృత్తిని కొనసాగిస్తున్నామని హరిదాసులు చెప్తున్నారు. జనాభా, ప్రాంతాలు పెరిగిపోవటం కారణంగా... హరిదాసులు నడవలేక బైక్ ఎక్కి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. హరిలో రంగ హరి అంటూ... చిడతలు వాయిస్తూ హరిదాసు చేసే హడావుడి ఆర్టిఫిషియల్​గా మారిందని కొందరు అంటుంటే... నవతరం హరిదాసు నయా గెటప్ సూపర్ అంటున్నారు మరికొందరు.

ఇదీచూడండి.కళాశాలలో సంక్రాంతి సంబరాలు.. సంప్రదాయ దుస్తుల్లో యువత

Intro:AP_RJY_86_04_ Hitech_ Haridas_RJY_PKG_AVB_AP10023

ETV Bharath:Satyanarayana(RJY CITY)

East Godavari.

( ) తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం,రాజానగరం నియోజకవర్గంలో లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి మూడు రోజులు ముచ్చటైన ముగ్గులతో పండగలో హరిలో రంగ హరి అంటూ చిడతలు వాయిస్తూ హరిదాసులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు అలాంటి హరిదాసులు ఈసారి కాస్త టెక్నాలజీకి అనుగుణంగా మారిపోయారు.

Vo- 1 ట్రెండ్ మారినా ట్రెండ్ తగ్గట్టుగా హరిదాసులు స్టైలు మారింది. ఒకప్పుడు చేతిలో చిడతలు పట్టుకుని గజగజ వణికించే చలిలో కాలినడకన చెప్పులు లేకుండా ఇంటింటికి తిరుగుతూ పాటలు పాడుతూ టెక్నాలజీకి కనెక్ట్ అయ్యారు. సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ వృత్తిని కాపాడుకుంటున్నారు.

vo-2

సంక్రాంతి పర్వదినాన పూర్వంలో వేకువజామునే ఊర్లోకి వచ్చి నెత్తిన అక్షయపాత్ర ఓ చేతిలో చిడతలు మరో చేతిలో తంబూర పట్టుకొని భక్తిరస హరి కీర్తనలతో కాలినడకన ఇంటింటికీ తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఉండేవారు. దానం స్వీకరించే సమయంలో హరిదాసు వినమ్రంగా క్రిందకి వంగి నెత్తి అక్షయ పాత్రలో దాన్ని స్వీకరించి ఆశీర్వదిస్తూ ఉంటాడు కానీ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, రాజానగరం నియోజకవర్గంలో లో సరికొత్త భిక్షాటనకు శ్రీకారం చుట్టారు హరిదాసులు

VO- 3

కాలం మారింది హరిదాసులు ఆచార తీరు మారింది ఇప్పుడంతా హైటెక్ కాలం వీధివీధినా నడిచే పనిలేకుండా నెత్తిన అక్షయ పాత్ర మోయుకుండా హరి కీర్తన సైతం పడకుండా కొత్త విధానానికి తెరలేపారు. తలపై ఉండాల్సిన అక్షయపాత్రను బైక్ హెడ్ డూమ్ వద్ద అమర్చుకొని బైక్ పై తీరిగ్గా కూర్చుని ఇల్లు ఇల్లు తిరుగుతూ నోటికి పని చెప్పకుండా టేప్ రికార్డు సౌండ్ బాక్సులు పెట్టేసి హరికీర్తన ను ఓ రేంజ్ లో వినిపిస్తూ ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేస్తున్నారు.

Vo:4 తరతరాలుగా సంప్రదాయాలను కాపాడుకునేందుకు ఈ వృత్తిని కొనసాగిస్తున్నామని ప్రాంతాలు పెరుగు పోవటం తో హరిదాసులు నడవలేక బైక్ ఎక్కి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని చెబుతున్నారు.

హరిలో రంగ హరి అంటూ చిడతలు వాయిస్తూ హరిదాసు చేసే హడావుడి ఆర్టిఫిషియల్ గా మారిందని కొందరు అంటుంటే నవతరం హరిదాసు నయా గెటప్ సూపర్ అంటున్నారు మరికొందరు.

byts

1.హరిదాస్ - సోమరాజు

2. byts

Body:AP_RJY_86_04_ Hitech_ Haridas_RJY_PKG_AVB_AP10023

Conclusion:AP_RJY_86_04_ Hitech_ Haridas_RJY_PKG_AVB_AP10023
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.