ETV Bharat / city

'హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా' - Balakrishna About Hindupuram District Issue

Balakrishna deesksha in Hindupuram: హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాల్సిందేనని నియోజకవర్గ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. హిందూపురం కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు. ఇవాళ బాలయ్య చేపట్టిన మౌనదీక్షకు కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు.

Balakrishna Rally in Hindupuram
Balakrishna Rally in Hindupuram
author img

By

Published : Feb 4, 2022, 12:17 PM IST

Updated : Feb 4, 2022, 2:15 PM IST

హిందూపురంలో బాలకృష్ణ మౌనదీక్ష

Balakrishna deesksha in Hindupuram: ఏపీలోని హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ప్రముఖ సినీనటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హిందూపురంలో బాలకృష్ణ మౌనదీక్ష చేపట్టారు. తొలుత పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలి నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

హిందూపురం కోసం దేనికైనా సిద్ధం

Balakrishna About Hindupuram District Issue : హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాల్సిందేనని బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఒకవేళ హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని కూడా తేల్చిచెప్పారు. హిందూపురం కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నానని.. అన్ని వసతులున్నందునే ఈ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు.

భారీగా తరలివచ్చిన శ్రేణులు

Balakrishna on District Issue : అంతకు ముందు నిర్వహించిన ర్యాలీలో తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేడ్కర్‌ కూడలిలో బాలకృష్ణ మౌనదీక్షకు కూర్చున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నేతలు డిమాండ్‌ చేశారు.

Balakrishna Mouna Deeksha: మరోవైపు సాయంత్రం అఖిలపక్ష నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలకృష్ణ పాల్గొననున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్‌తో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై ఆ సమావేశంలో చర్చించనున్నారు.

Last Updated : Feb 4, 2022, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.