Balakrishna at Kodikonda: ఏపీలోని శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ గ్రామంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. ఇటీవల వైకాపా నాయకులు దాడిలో గాయపడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. బాలకృష్ణ రాకతో తెదేపా కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహం నిండింది. ఈ సందర్భంగా.. దాడి గురించి స్థానిక తెదేపా నేతలు.. బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. తమ కార్యకర్తల జోలికొస్తే ఖబర్దార్ అంటూ వైకాపా నేతలకు బాలకృష్ణ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెదేపా కార్యకర్తలకు కష్టం వస్తే అర్ధరాత్రైనా సరే వస్తానని బాలయ్యబాబు హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి :