ETV Bharat / city

రాజ్​భవన్​లో పటేల్​, ఇందిరాగాంధీకి బండారు దత్తాత్రేయ నివాళులు

author img

By

Published : Oct 31, 2020, 7:16 PM IST

ఏక్తా దివస్​ సందర్భంగా హైదరాబాద్​ రాజ్​భవన్​లో సర్దార్​ వల్లభ్​ భాయ్​ పటేల్​కు హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ శ్రద్ధాంజలి అర్పించారు. అనంతరం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన నివాళులర్పించారు.

himachal pradesh governor  bandaru dattatreya on patel jayanthi and indira gandhi vardhanthi
రాజ్​భవన్​లో పటేల్​, ఇందిరాగాంధీకి బండారు దత్తాత్రేయ నివాళులు

సర్దార్​ వల్లభ్​ భాయ్​ పటేల్​ 145వ జయంతి సందర్భంగా హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ.. హైదరాబాద్​ రాజ్​భవన్​లో పటేల్​కు శ్రద్ధాంజలి అర్పించారు. ఉక్కు మనిషి దృఢసంకల్పం, కార్యదక్షత, త్యాగం, సేవానిరతి ఆయన విలక్షణమని దత్తాత్రేయ అన్నారు. 562 సంస్థానాలను విలీనం చేసి కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఏకం చేసిన మహానుభావుడు పటేల్​ అని కొనియాడారు.

కులమతాలకు అతీతంగా దేశ సమైక్యతకు, సమగ్రతకు పాటుపడటమే పటేల్​కు మనమిచ్చే నిజమైన నివాళి అని.. అతని కృషికి గుర్తుగానే ఏక్తా దివస్​ను జరుపుకుంటున్నామని దత్తాత్రేయ వివరించారు. అదే విధంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 36వ వర్ధంతిని పురస్కరించుకుని దత్తాత్రేయ ఆమెకు నివాళులు అర్పించారు. దేశ అభవృద్ధి కోసం ఆమె చేసిన కృషి ఎప్పుడూ ప్రజల్లో గుర్తుండిపోతుందని బండారు కొనియాడారు.

ఇదీ చదవండిః రాజభవన్​లో ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్​ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.