ETV Bharat / city

వారికి నాన్​కేడర్ ఐపీఎస్​లుగా రెగ్యులర్ పదోన్నతులు కల్పించాలి: హైకోర్టు - telangana varthalu

డీఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీలకు నాన్​కేడర్ ఐపీఎస్​లుగా రెగ్యులర్ పదోన్నతులు కల్పించాలంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం రూపొందించిన సీనియారిటీ జాబితా ప్రకారం పదోన్నతులు కల్పించాలని ఆదేశించింది.

వారికి నాన్​కేడర్ ఐపీఎస్​లుగా రెగ్యులర్ పదోన్నతులు కల్పించాలి:హైకోర్టు
highcourt orders to government on
author img

By

Published : Dec 24, 2020, 7:21 AM IST

రాష్ట్రంలోని డీఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీలకు నాన్​కేడర్ ఐపీఎస్​లుగా రెగ్యులర్ పదోన్నతులు కల్పించాలంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ పదోన్నతులు 2017లో ఆంధ్రప్రదేశ్ రూపొందించిన సీనియారిటీ జాబితాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​లో వెలువడే తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. తాత్కాలిక పదోన్నతుల ద్వారా తమకు అన్యాయం జరుగుతోందని, రెగ్యులర్ పదోన్నతులు కల్పించేలా ఆదేశాలివ్వాలంటూ ఎన్​.ఆరో కుమార్, మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్​పై విచారించిన జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీల సీనియారిటీ జాబితా రూపొందించకముందే తెలంగాణ ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన 101 మందికి ఏఎస్పీలుగా పదోన్నతులు కల్పించగా... ప్రస్తుతం వారిలో 43 మంది పదవీ విరమణ చేశారు.

ఏపీ ప్రభుత్వం రూపొందించిన సీనియారిటీ జాబితాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపి తేల్చడానికి సుదీర్ఘ కాలం పడుతుందని, అప్పటివరకు రెగ్యులర్ పదోన్నతులు నిలిపివేయడం సరికాదని హైకోర్టు పేర్కొంది . కేంద్ర ప్రభుత్వం తుది కేటాయింపులు జరిపాక సీనియారిటీ జాబితాపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని, అభ్యర్థులే కోర్టును ఆశ్రయించారంది. సీనియర్లను పట్టించుకోకుండా జూనియర్లకు పదోన్నతులు కల్పించడం సరికాదని, అంతేగాకుండా ఉద్యోగుల నైతికబలం దెబ్బతింటుందని ధర్మాసనం పేర్కొంది. అందువల్ల ఏపీ ప్రభుత్వం రూపొందించిన సీనియారిటీ జాబితా ప్రకారం రెగ్యులర్ పదోన్నతులు కల్పించాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: తెలుగు రాష్ట్రాల్లో నవయువ పారి‘శ్రామికులు’

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.