ETV Bharat / city

ఫిలిప్పీన్స్​ పరిస్థితి తీసుకురావొద్దు: హైకోర్టు - హైకోర్టు

కార్మికులు, ప్రభుత్వ మొండి వైఖరితో రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మికులతో మరోసారి చర్చలు జరపాలని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.

ఫిలిప్పీన్స్​ పరిస్థితి తీసుకురావొద్దు: ధర్మాసనం
author img

By

Published : Oct 18, 2019, 11:05 PM IST

ఫిలిప్పీన్స్​ పరిస్థితి తీసుకురావొద్దు: ధర్మాసనం

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో యాజమాన్యం వీలైనంత తొందరలో చర్చలు జరపాలని హైకోర్టు సూచించింది. చర్చల సారాంశాన్ని ఈ నెల 28న తెలపాలని విచారణను వాయిదా వేసింది. సమ్మె వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో మరిన్ని సమస్యలు తలెత్తే ప్రమాదముందని హైకోర్టు తెలిపింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సమస్య పరిష్కారమయ్యే విధంగా చూడాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది.

విచారణలో ధర్మాసనం ప్రభుత్వాన్ని పలు సూటి ప్రశ్నలు వేసింది. ఆర్టీసీకి ఎండీని ప్రభుత్వం ఎందుకు నియమించలేదని అడిగింది. ఎండీని నియమించి ఉంటే కార్మికుల్లో నమ్మకం పెరిగి ఉండేదని... కార్మికుల డిమాండ్లలో సగానికి పైగా ఆర్థిక సంబంధం లేనివే ఉన్నాయని తెలిపింది. కార్మికుల మొత్తం డిమాండ్ల గురించి కోర్టు అడగడం లేదని... ఎండీ నియామకం, హెచ్ఆర్ఏ పెంపు, తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు మెరుగుపర్చడం, బస్సులకు నాణ్యమైన స్పేర్ పార్ట్స్ సరైన సమయంలో కొనుగోలు చేయడం లాంటి డిమాండ్లు న్యాయమైనవేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి ఉదారత చూపాలని.... లేకపోతే సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపింది.

నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి: హైకోర్టు

ఆదిలాబాద్ ఏజెన్సీలోని ప్రజలు వైద్యం కోసం పట్టణాలకు రాలేని పరిస్థితి నెలకొందని.... విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని, నిత్యావసర ధరలు సైతం పెరుగుతున్నాయని ధర్మాసనం.. అదనపు అడ్వకేట్ జనరల్ వద్ద ప్రస్తావించింది. ఫిలిప్పీన్స్​లో సమ్మెలు, ప్రజల తిరుగుబాటు వల్ల ఆ దేశం తిరోగమన స్థితిలోకి వెళ్లిందని హైకోర్టు ఉటంకించింది. సమ్మె అనేది ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి సంబంధించింది కాదని... ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న విషయమని కోర్టు అభిప్రాయపడింది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ ఐకాస తలపెట్టిన బంద్​కు కూడా రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రైవేట్ క్యాబ్​ల సంఘాలు మద్దతు ఇస్తున్నారు కదా అని అదనపు ఏజీని అడిగింది.

ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారి డిమాండ్లు నెరవేర్చడం సాధ్యం కాదని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు హైకోర్టుకి తెలిపారు. ఆర్టీసీ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన హైకోర్టుకు నివేదించారు. ఇప్పటికే కార్మికులకు 44శాతం ఫిట్​మెంట్, 16శాతం ఐఆర్ ఇచ్చిందని.... అయినా సంస్థ లాభాల బాటలో పయనించలేదని అదనపు ఏజీ వాదించారు. కార్మికులు సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించిందని.... చర్చల దశలోనే కార్మికులు సమ్మెకు దిగారని అదనపు ఏజీ కోర్టుకు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్​ను ముందుంచి.. కేవలం దానిపైనే పట్టుబట్టారని.... అది సాధ్యం కాదని కమిటీ చెప్పగా.. మిగతా డిమాండ్ల గురించి ప్రస్తావించకుండానే సమ్మెకు వెళ్లారని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశామని నివేదించారు.

ఆర్థిక పరిస్థితి వల్లే ఎండీని నియమించలేదు...

ఆర్థిక పరిస్థితి దృష్ట్యానే ఆర్టీసీ ఎండీ నియమించలేదని.... ప్రస్తుతం ఉన్న ఇన్​ఛార్జీ ఎండీ సంస్థ ప్రయోజనాలు కాపాడే విధంగా పనిచేస్తున్నాడని అదనపు ఏజీ హైకోర్టుకు తెలిపారు. సమ్మె విషయంలో ఇరు పక్షాలు మొండి పట్టుదలతో ఉన్నాయని... దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. సమ్మెను విరమించి విధుల్లో చేరేలా ఆర్టీసీ కార్మిక సంఘాలను.... చర్చలు జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు దేశాయ్ ప్రకాశ్ రెడ్డి, పీవీ కృష్ణయ్య, రాపోల్ భాస్కర్​లు కోరారు. చర్చలకు పిలిచినా సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ ఐకాస నేతలు తెలిపారు. రేపు తలపెట్టిన బంద్ సైతం నిర్వహిస్తామని ఆర్టీసీ ఐకాస నేతలు తెలిపారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.