అమరావతి ఐకాస నేతలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసం వద్ద ఆయన అభిమానులు ఆందోళన నిర్వహించారు. ఐకాస నేతలు చిరంజీవిని కలవడానికి జూబ్లీహిల్స్‌కు వస్తున్నారనే సమాచారం మేరకు వారిని అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు మెగాస్టార్ ఇంటికి చేరుకున్నారు.
చిరంజీవికి మద్దతుగా నినాదాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రులు, శాసనసభ్యులను దుయ్యబట్టారు. అభిమానుల రాకతో అక్కడే ఉన్న పోలీసులు.. ఎవరిని చిరంజీవి నివాసానికి చేరుకోకుండా అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చిరంజీవి ఇంటికి వెళ్లే దారిని బారికేడ్లతో మూసివేసి బందోబస్తు నిర్వహించారు.
అయితే తాము చిరంజీవి ఇంటిని ముట్టడించడంలేదని అమరావతి ఐకాస నేతలు స్పష్టం చేశారు. ఈ వార్తను తాము పూర్తిగా ఖండిస్తున్నామన్నారు.
ఇవీ చూడండి: కరెంటు ఛార్జీలపై నేడు నిర్ణయం