ETV Bharat / city

బతకాలనే ఆరాటం.. మృత్యువుతో నిత్యం పోరాటం.. - Latest News Of Ap

Kidney Problems In Ntr District: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో మూత్రపిండాల వ్యాధి విస్తరిస్తోంది. ఈ వ్యాధితో బాధపడతూ 20 సంవత్సారాలలో వందల మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటికీ అనేక మంది ఈ వ్యాధితో పోరాడుతున్నారు. తమని ‌ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.

బతకాలనే ఆరాటం.. మృత్యువుతో నిత్య పోరాటం..

author img

By

Published : Sep 2, 2022, 10:29 AM IST

Kidney Problems In Ntr District: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు, నందిగామ, మైలవరం, జగ్గయ్యపేటల్లో మూత్రపిండాల వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు మండలంలోని గిరిజన తండాల్లో రెండు దశాబ్దాల్లో వందలాది మంది చనిపోయారు. ఈ ఏడాదిలోనే ఆగస్టు నెల వరకు 35 మంది మృతి చెందగా, బతకాలనే ఆరాటంతో డయాలసిస్‌ చేయించుకుంటూ పదుల సంఖ్యలో మృత్యువుతో పోరాటం చేస్తున్నారు.

గత ప్రభుత్వంలో ప్రజా సంఘాలు తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో సర్వే చేయగా, 15 మండలాల్లో కిడ్నీ బాధితులున్నట్లు బయటపడింది. 47 గ్రామాల్లో తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. బాధితులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలని ఇచ్చిన వినతులకు అప్పటి ప్రభుత్వం స్పందించింది. రేషన్‌ దుకాణాల ద్వారా పోషకాహారం, ఉచితంగా మందులు, డయాలసిస్‌ కేంద్రాలకు వెళ్లేందుకు వాహనాలు సమకూర్చింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో డయాలసిస్‌ చేయించుకునే రోగులకు పింఛన్లు మంజూరు చేసింది. ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలకు శుద్ధ జలాలు సరఫరా చేసింది. గడిచిన మూడేళ్లుగా వైకాపా ప్రభుత్వంలో బాధితులకు ఎలాంటి సాయం అందడం లేదని వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తూ ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు.

ఇద్దరిని పొగొట్టుకొని జీవచ్ఛవంలా: "కిడ్నీ వ్యాధి మా కుటుంబంపై పగబట్టింది. మా నాన్న పీర్యా 2007, నా భార్య చిలక 2020లో చనిపోయారు. నేనూ గత పదేళ్ల నుంచి మందులు వాడుతూ జీవచ్ఛవంలా ఉన్నా. నా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల క్రియాటిన్‌ పెరగడంతో డయాలసిస్‌ చేయించుకుంటున్నా. మా ముగ్గురి చికిత్స కోసం ఉన్న భూమిని తెగనమ్ముకున్నాను. మరో రూ.4 లక్షల అప్పు ఉంది. ఇంట్లో నా కొడుకు ఒక్కడే కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డయాలసిస్‌ కోసం వారానికి రెండు సార్లు తిరువూరు వెళ్లి రావడానికి, నెలవారీ మందులకు చేతిలో చిల్లిగవ్వలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. పింఛనూ మంజూరు కాలేదు". -భూక్యా బాబ్జి, కిడ్నీ బాధితుడు, దీప్లానగర్‌, ఎ.కొండూరు
వార్డు సభ్యురాలినైనా సాయమేదీ..?: "రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా. క్రియాటిన్‌ ఎక్కువ కావడంతో రెండు నెలలుగా డయాలసిస్‌ మీద ఉన్నా. చికిత్సకు డబ్బుల్లేక వడ్డీకి అప్పు తెచ్చి ఖర్చు పెడుతున్నా. అధికార పార్టీకి చెందిన వార్డు సభ్యురాలిగా ఉన్న నాకే ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమందలేదు. మిగిలిన వారి పరిస్థితి ఎలాగుందో అర్థమవుతుంది. డయాలసిస్‌ మీద ఉన్నా నిబంధనల ప్రకారం నాకు అప్పుడు పింఛన్‌ మంజూరు కాదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అది చేస్తాం, ఇది చేస్తామన్నారు. రెండు నెలలుగా మంచం పట్టిన నన్ను పరామర్శించడానికీ ఎవరూ రాలేదు. నన్ను కాపాడుకునేందుకు భర్త, కొడుకు అష్టకష్టాలు పడుతున్నారు. చావలేక బతుకుతున్నా, చికిత్స నిమిత్తం ఇప్పటి వరకు రూ.3 లక్షల వరకు అప్పులు చేశాం". -భరోతు జామక, దీప్లానగర్‌

మరో కిడ్నీ బాధితుడి మృతి : ఎ.కొండూరు మండలంలోని గిరిజన తండాల్లో మృత్యుఘంటికలు మోగుతూనే ఉన్నాయి. గొల్లమందలతండాకు చెందిన దారావతు రాజు (35) కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ కృష్ణా జిల్లాలోని చినఅవుటుపల్లి పిన్నమనేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. రాజు స్వయానా పంచాయతీ సర్పంచి రాముడికి అన్న. నెల రోజుల వ్యవధిలోనే మృతుల సంఖ్య ఏడుకు చేరడంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పింఛన్లు మంజూరు చేయండి: కిడ్నీ రోగులకు ప్రభుత్వాస్పత్రుల్లో డయాలసిస్‌ ఉచితమైనా, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారు. నెలవారీ మందులు, రవాణా ఖర్చులు కలిపి తడిసి మోపెడవుతున్నాయి. బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే ఒకరు తోడుగా వెళ్లాల్సిందే. రెక్కాడితే డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన వీరు కూలీ పనులు మానుకోవాల్సి వస్తుంది. కిడ్నీ బాధితులందరికీ రూ.10 వేలు మంజూరు చేయాలని ప్రజా సంఘాలు డిమాండు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన కొరవడింది. బాధితులు ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో అధికారులకు అందజేస్తున్న వినతిపత్రాలు బుట్టదాఖలవుతున్నాయి.

ఇవీ చదవండి:

ఆర్టీసీలో క్యాష్​లెస్​ సేవలు.. ఇప్పుడు కరీంనగర్​లోనూ..

పంటల బీమా పథకంలో కీలక మార్పులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.