వ్యవసాయం తర్వాత జౌళి, చేనేత రంగానికి రాష్ట్రంలో అధిక డిమాండ్ ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత రంగం అభివృద్ధి, నేతన్నల సమస్యలపై శాసన సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది జీవనోపాధి పొందుతున్న రంగం జౌళి, చేనేత రంగమని మంత్రి చెప్పారు. వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ నెలకొల్పటం ద్వారా జిల్లా ప్రజలకు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. భూసేకరణకు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి చూపిన చొరవ, ప్రారంభానికి స్థానిక ప్రజలను చైతన్యం చేసిన తీరును మంత్రి కేటీఆర్ అభినందించారు. టీ ట్యాప్ పేరుతో ప్రత్యేక విధానం తీసుకురావటం వల్ల రాష్ట్రంలో చేనేత పరిశ్రమ కోసం పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పశుపతి అనే సంస్థ 243 కోట్ల రూపాయలతో, గ్యాంబుల్ అనే సంస్థ 17కోట్ల పెట్టుబడులు పెట్టాయని... పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
వ్యవసాయం తర్వాత జౌళి, చేనేత రంగానికే డిమాండ్ - TEXTILES
జౌళి, చేనేత రంగానికి సీఎం కేసీఆర్ బడ్జెట్లో తొలి ప్రాధాన్యత ఇచ్చినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత రంగం అభివృద్ధి, నేతన్నల సమస్యలపై శాసన సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.