ETV Bharat / city

రాజధాని భూముల్లో ఇన్​సైడర్ ట్రేడింగ్ జరగలేదు : హైకోర్టు - ఇన్​సైడర్​ ట్రేడింగ్ కేసులు కొట్టివేత

ఏపీ రాజధాని అమరావతి భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందంటూ కొందరు వ్యక్తులపై నమోదైన కేసులను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ప్రైవేటు భూములు కొనుగోలు వ్యవహారంలో కుట్రకోణం దాగుందంటూ ఏపీ సీఐడీ విభాగం నమోదు చేసిన క్రిమినల్ కేసుల సెక్షన్లు... ఈ కేసుకు వర్తించవని స్పష్టం చేసింది. ఏపీ సీఐడీ విభాగం తమపై నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ ను రద్దు చేయాలంటూ.. పిటిషనర్లు వేసిన క్వాష్ పిటిషన్ ను ధర్మాసనం ఆమోదించింది.

రాజధాని భూముల్లో ఇన్​సైడర్ ట్రేడింగ్ జరగలేదు: కేసులు కొట్టేసిన హైకోర్టు

author img

By

Published : Jan 19, 2021, 10:57 PM IST

ఆంధ్రప్రదేశ్​ రాజధాని అమరావతి పరిధిలో.. ఆరేళ్ల కిందట జరిగిన భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ.. తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన సలివేంద్ర సురేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతి భూముల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా తాను సమాచారం సేకరించానని.... కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థల ప్రతినిధులపై ఫిర్యాదు చేశారు. సురేష్ ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడీ విభాగం... ప్రాథమిక విచారణ జరిపి.. లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నార్త్ వెస్ట్ హోల్డింగ్ సంస్థ భాగస్వామ్యులు, వెర్టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వాములు, గాయత్రీ రియల్టీస్, గుడ్​లైఫ్ ఎస్టేట్స్, కిలారు శ్రీహాస అనే వారిపై సెప్టెంబర్ 2020లో ఉమ్మడి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి.. ఐపీసీ సెక్షన్ 420, 409, 406, 120-బీ కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వంలోని కొందరు పెద్దలతో ఉన్న పరిచయాల వల్ల.. రాజధాని ఏ ప్రాంతంలో వస్తుందో ముందుగా తెలుసుకుని.. ఆ ప్రాంతాల్లో రాజధాని అధికారిక ప్రకటన కంటే ముందుగానే 2014 జూన్ నుంచి డిసెంబర్ మధ్య భూములు కొన్నారని వీరిపై అభియోగాలు నమోదు చేశారు.

పిటిషన్ల దాఖలు.....

తమపై కుట్ర పూరితంగా కేసులు నమోదు చేశారని... తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని... తమపై ఉమ్మడిగా నమోదైన ఎఫ్.ఐఆర్ ను రద్దు చేయాలంటూ.. కేసులు నమోదైన వ్యక్తులంతా వేర్వేరుగా క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ మానవేంద్రరాయ్ నేతృత్వంలోని సింగిల్ జడ్జ్ బెంచ్ మంగళవారం విచారణ నిర్వహించి తీర్పు వెలువరించింది.

ఇన్​సైడర్ ట్రేడింగ్ కాదు....

పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఆరేళ్ల క్రితం చట్టప్రకారంగా జరిగిన భూముల కొనుగోళ్లపై.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు నమోదు చేసిందని సిద్ధార్థ లూథ్రా వాదించారు. రాజధాని వస్తుందన్న ముందస్తు సమాచారంతోనే భూములు కొనుగోళ్లు చేశారన్న సీఐడీ వాదనలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే విజయవాడ-గుంటూరు మధ్య కృష్ణానది చెంతన రాజధాని వస్తుందని ప్రకటించారని.. రాజధాని ఎక్కడ వస్తుందన్న విషయంపై అనేక పత్రికల్లో కథనాలు వచ్చాయని.. కాబట్టి ఇది రహస్యమైన విషయమేమీ కాదని లూథ్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఫిర్యాదుదారుడికి భూముల కొనుగోళ్లతో ఎలాంటి సంబంధం లేదని.. బయట వ్యక్తుల ప్రోద్భలంతోనే ఫిర్యాదు చేసినట్లుగా అర్థమవుతోందన్నారు. ప్రైవేటు భూములు కొనుగోళ్లకు క్రిమినల్ చర్యలు ఆపాదించడం చట్టప్రకారం సమంజసంగా లేదన్నారు. భూముల లావాదేవీల్లో అమ్మకందార్లకు ఎలాంటి నష్టం జరగలేదని... వారిని బలవంతం చేయలేదని.. ఇష్టపూర్వకంగానే క్రయ విక్రయాలు జరిగాయని స్పష్టం చేశారు. ఎలాంటి మోసం లేనందున సీఐడీ నమోదు చేసిన ఐపీసీ 420, అనుబంధ సెక్షన్లకు అర్థమే లేదన్నారు. ఈ వ్యవహారంలో ఇన్​సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ సీఐడీ మోపిన అభియోగాలు అర్థరహితం అన్నారు. ఇన్​సైడర్ ట్రేడింగ్ అన్నది స్టాక్ మార్కెట్లలో మాత్రమే జరుగుతుందని.. భూముల విక్రయాలకు అది వర్తించదన్నారు. ఇన్​సైడర్ ట్రేడింగ్ ఐపీసీ పరిధిలోకి రాదని చెప్పారు.

అక్రమాలు జరిగాయి..

భూముల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం తరపున.. అడ్వొకేట్ జనరల్ శ్రీరాం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి వాదనలు వినిపించారు. ఏదైనా ఆస్తి కొనుగోలు విషయంలో కొనుగోలుదారుడికి అదనపు లబ్ధి కలుగుతుందని సమాచారం ఉంటే .. ట్రాన్సఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఆ విషయం ముందుగానే విక్రేతకు తెలపాలని అడ్వొకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని వల్ల తమకు లబ్ధి కలుగుతుందన్న విషయం కొనుగోలుదారులు దాచిపెట్టారని ఆరోపించారు. రాజధానికి సంబంధించిన జీవోల జారీ విషయంలోనూ.. కొన్ని అవకతవకలు జరిగాయని కొందరు ఉద్యోగులు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారని... దీనిని బట్టి భూములు కొనుగోలు వెనుక కుట్ర ఉందన్న విషయం తెలుస్తుందని ఏజీ శ్రీరాం వాదించారు. దీనిని పిటిషనర్ల తరపు న్యాయవాది సిద్దార్థ లూథ్రా తోసిపుచ్చారు. ట్రాన్సర్ ఆఫ్ ప్రాపర్టీస్ యాక్టు ఈ కేసులో వర్తించదని తెలిపారు. సహజసిద్ధంగా, మెటీరియల్ పరంగా కొనుగోలుదారుడికి లబ్ధి కలిగి.. ఆ విషయం విక్రేతకు తెలియకపోతేనే సమాచారం ఇవ్వాలన్నారు. కొనుగోలుదారులు ఏ ఉద్దేశ్యంతో భూములు కొంటున్నారన్న విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ రాజధాని వస్తుందన్న సమాచారంతోనే భూములు కొనుగోలు చేసినప్పటికీ.. అది నేరపూరితం కాదని.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశమే లేదని వాదించారు.

కేసుల కొట్టివేత....

ఇరువైపుల వాదనలను విన్న న్యాయస్థానం.. పిటిషనర్లపై నమోదైన కేసులను కొట్టివేసింది. ప్రైవేటు భూముల కొనుగోళ్లకు క్రిమినల్ చర్యలను ఆపాదించడం సబబు కాదన్న పిటిషనర్ల వాదనను పరిగణనలోకి తీసుకుంది. సీఐడీ చెబుతున్న ఇన్​సైడర్ ట్రేడింగ్ వ్యవహారం అసలు ఐపీసీ సెక్షన్ల పరిధిలోకే రాదని పేర్కొంది. భూముల విక్రయం ద్వారా అమ్మకందార్లకు ఎలాంటి నష్టం జరగలేదని.. కొనుగోలుదారులు మోసగించినట్లుగా కూడా ఎలాంటి ఆధారాలు లేవని.. కాబట్టి వీరిపై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్లు 420, 406, 409, 120-బీ అనేవి వర్తించవని స్పష్టం చేసింది. సీఐడీ చేసిన ఆరోపణలు ఏవీ కూడా ప్రాకిక్యూషన్ కు అర్హం కావన్న కోర్టు.. ఎఫ్.ఐఆర్​ను క్వాష్ చేసింది.

ఇదీ చదవండి: క్యాప్​, మాస్క్​తో పోలీసులు గుర్తుపట్టకుండా బయటకొచ్చిన దేవినేని ఉమ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.