సినీ దర్శకుడు ఎన్ శంకర్‌కు ప్రభుత్వం కేటాయించిన భూమిలో స్టూడియో నిర్మాణంపై స్టే ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. వట్టినాగులపల్లిలో తక్కువ ధరకు ఐదెకరాలు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి గల ధర్మాసనం ఈరోజు మరోసారి విచారణ చేపట్టింది.
త్వరలో బదిలీపై వెళ్లనున్నందున తుది విచారణ చేపట్టలేనని సీజే ఆర్ఎస్ చౌహాన్ తెలిపారు. తదుపరి విచారణను జనవరి ఆరుకు వాయిదా వేశారు.
ఇదీ చూడండి: ఫెలోషిప్ అక్రమాలపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం