Telangana HC on BJP MLAs Suspension: భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రొసిడింగ్స్ ఉత్తర్వులు, వీడియో రికార్డులు సమర్పించేలా ఆదేశాలిచ్చేందుకు కూడా న్యాయస్థానం అంగీకరించలేదు. అయితే.. పూర్తిస్థాయి విచారణ కోసం అసెంబ్లీ కార్యదర్శికి మరోసారి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై విచారణను మరో నాలుగు వారాలకు వాయిదా వేసింది.
బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేదాకా సభ నుంచి తమను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సస్పెన్షన్ కొట్టివేసి సమావేశాలకు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని భాజపా ఎమ్మెల్యేలు కోరారు. సస్పెన్షన్ తీర్మానంతో పాటు నిన్నటి సమావేశాల వీడియో రికార్డింగులను తెప్పిచడంతో పాటు తమకూ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు.
ఏం జరిగిందంటే..?
సోమవారం(మార్చి 7)రోజు శాసన సభలో మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రవేశపెడుతుండగా.. భాజపా సభ్యులు ఈటల రాజేందర్, రఘునందర్రావు, రాజాసింగ్.. అడ్డుతగులుతున్నారంటూ వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలంటూ.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది. దీనిపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు. ఈ సెషన్ పూర్తయ్యే వరకు భాజపా సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: