రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు న్యాయ పరమైన అడ్డంకులు తొలగిపోయాయి. వార్డుల పునర్విభజనను ఖరారు చేస్తూ జులైలో జారీ చేసిన తుది నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది. వార్డుల పునర్విభజన, ఓటరు జాబితా సవరణపై మళ్లీ అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
నేటి నుంచి వారం రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి.. తర్వాత వారంలో వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని పేర్కొంది. ప్రక్రియ అంతా చట్టబద్ధంగా సాగాలని స్పష్టం చేసింది. ప్రభుత్వాధికారులు సరిగా పనిచేస్తే... ప్రజలు కోర్టులకెక్కాల్సిన అవసరం ఉండదని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.