ETV Bharat / city

ఎల్​ఆర్​ఎస్​పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు - తెలంగాణ ఎల్​ఆర్​ఎస్​ వార్తలు

telangana lrs
telangana lrs
author img

By

Published : Sep 17, 2020, 12:03 PM IST

Updated : Sep 17, 2020, 3:43 PM IST

12:01 September 17

ఎల్​ఆర్​ఎస్​పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ఎల్ఆర్ఎస్ రాజ్యాంగబద్ధతపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమ లే అవుట్ల క్రమబద్ధీరణను సవాల్ చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఎల్ఆర్ఎస్ పలు చట్టాలకు విరుద్ధంగా ఉందని.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ చట్టాల్లో క్రమబద్ధీకరణకు అవకాశం లేదని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యం రెడ్డి వాదించారు.  

ఎల్ఆర్ఎస్​పై కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు వారాలు గడువు ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు. అయితే అప్పటి వరకు ప్రక్రియ ఆపాలని లేదా తుది తీర్పునకు లోబడి ఉంటుందని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. ప్రభుత్వ వైఖరి తెలుసుకోకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది. 

ఇదీ చదవండి: పదా అన్న ఇళ్లు చూసివద్దాం... భట్టితో తలసాని

Last Updated : Sep 17, 2020, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.