సచివాలయం కూల్చివేత పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. సాంకేతిక నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వం సమర్పించింది. ప్రస్తుతం ఉన్న భవనాలు మరమ్మతులు చేయలేని స్థితిలో ఉన్నట్లు కమిటీ చెప్పిందని తెలిపింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. సరిదిద్దే అవకాశమున్న భవనాలను కూల్చాలనుకోవడం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. ఏడేళ్ల క్రితం నిర్మించిన హెచ్-బ్లాక్‌ను కూల్చాల్సిన అవసరమేంటన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోకూడదు: పిటీషనర్
నూతన సచివాలయం విస్తీర్ణం, నమూనా వివరాలు హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకుంది. సుమారు 10 లక్షల చ.అడుగుల్లో నిర్మించనున్న నూతన సచివాలయ నమూనా ఇంకా ఖరారు కాలేదని న్యాయమూర్తులకు విన్నవించింది. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని ప్రభుత్వం వాదించింది. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా ఉందా? అని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.