విశాఖలో నిన్న చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జరిగిన పరిణామాలపై హైకోర్టులో విచారణ జరిగింది. సెక్షన్ 151 కింద చంద్రబాబుకు నోటీసు ఇవ్వడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఆ సెక్షన్ కింద నోటీసు ఎలా ఇస్తారంటూ పోలీసులను నిలదీసింది. దీనిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించింది. తెదేపా అధినేత పట్ల పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వైకాపా కార్యకర్తలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని పేర్కొన్న పిటిషనర్.. హోంశాఖ కార్యదర్శి, విశాఖ సీపీ, ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చారు. విశాఖలో తెదేపా ప్రజా చైతన్య యాత్రకు అనుమతివ్వాలని కోరారు. చంద్రబాబు యాత్రకు అనుమతి తీసుకున్నామని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.
'చంద్రబాబుకు ఆ సెక్షన్ కింద నోటీసులు ఎలా ఇస్తారు..?' - chandrababu tour protest case news
తెదేపా అధినేత విశాఖ పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలపై పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. సెక్షన్ 151 కింద చంద్రబాబుకు నోటీసు ఎలా ఇస్తారని నిలదీసింది. దీనిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించింది. చంద్రబాబు పట్ల పోలీసుల వైఖరిని నిరసిస్తూ తెదేపా మాజీ ఎమ్మెల్యే కిడారి శ్రావణ్ కుమార్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేసింది.