ప్రజాప్రతినిధుల కేసులపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ దాఖలు చేసిన ప్రజాప్రతినిధుల కేసుల వ్యాజ్యంపై సత్వర విచారణ జరపాలన్న పిటిషన్‌పై న్యాయస్థానం విచారించింది.
సదరు కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణ జరపలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రజాప్రతినిధుల కోర్టులో పీపీ, సిబ్బందిని నియమించాలని పిటిషనర్ కోరగా... సుప్రీంకోర్టుకే విజ్ఞప్తి చేయాలని న్యాయస్థానం సూచించింది.