Chiranjeevi couples in dokiparru: ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీ గోదారంగనాథుల కల్యాణ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి దంపతులు పాల్గొన్నారు. వేదపండితులు పూర్ణకుంభంతో చిరంజీవి దంపతులకు స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం చిరంజీవి దంపతులకు పండితులు ఆశీర్వచనాలు అందజేసి, ప్రసాదాన్ని అందించారు.
క్యాలెండర్ ఆవిష్కరించిన మెగాస్టార్
calendar released by megastar: శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. స్వామివారి కల్యాణ వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తలు పి.పి.రెడ్డి, కృష్ణారెడ్డి, ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
- ఇవీ చదవండి:
- Chiranjeevi: రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలపై స్పందించిన చిరంజీవి
- Nagarjuna: 'మా అందరి కోసమే సీఎం జగన్తో చిరంజీవి సమావేశం'
- Chiranjeevi: 'సినీ పరిశ్రమ సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని భావిస్తున్నాం'
- Chiranjeevi Meets AP CM Jagan: జగన్తో చిరంజీవి భేటీ.. సినిమా టికెట్ల ధరలపై ప్రధానంగా చర్చ
- ఇండస్ట్రీ పెద్దగా ఉండను కానీ..: హీరో చిరంజీవి