ETV Bharat / city

రాష్ట్రంలో అనుమతి పొందిన ప్రైవేటు ల్యాబొరేటరీలు ఇవే.. - తెలంగాణ కరోనా వార్తలు

ఇంతకుముందు కరోనా పరీక్షలు చేయించుకోవాలంటే సర్కారు వైద్యానికే వెళ్లాలి. కొవిడ్‌ లక్షణాలున్నవారు, పాజిటివ్‌ వ్యక్తితో సన్నిహితంగా ఉన్నవారి నమూనాలు సేకరించి ప్రభుత్వ ప్రయోగశాలల్లోనే పరీక్షలు నిర్వహించేవారు. ఇక నుంచి భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) నుంచి అనుమతి పొందిన 18 ప్రైవేటు ల్యాబ్‌లకు కరోనా పరీక్షలు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. అనుమానిత లక్షణాలున్నవారు వాటిలో పరీక్షలు చేయించుకోవచ్చు. ఇంటి వద్ద కూడా నమూనాలు ఇవ్వొచ్చు.

telangana corona virus
telangana corona virustelangana corona virus
author img

By

Published : Jun 16, 2020, 7:55 AM IST

Updated : Jun 16, 2020, 11:04 AM IST

రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఇక నుంచి ఎక్కడైనా చేయించుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల కోసమే నిరీక్షించాల్సిన అవసరం లేదు. ప్రైవేటుకు పచ్చజెండా ఊపుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది. అవసరమైతే ఇంటికి వచ్చి కూడా ప్రైవేటు వారు పరీక్షలు నిర్వహిస్తారు. వైరస్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల మేరకే పరీక్షలు నిర్వహించాలని, ప్రభుత్వం నిర్దేశించిన ధరలనే అమలు చేయాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీచేసింది. నిబంధనలను ఉల్లంఘించిన ప్రయోగశాలలు, ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని జీవోలో హెచ్చరించింది.

అనుమతి పొందిన ప్రైవేటు ల్యాబొరేటరీలు

  • అపోలో ల్యాబొరేటరీ సర్వీసెస్‌, జూబ్లీహిల్స్‌
  • విజయ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌, హిమాయత్‌నగర్‌
  • విమ్టా ల్యాబ్స్‌, చర్లపల్లి బీ పాథ్‌కేర్‌ ల్యాబ్స్‌, మేడ్చల్‌
  • అపోలో హెల్త్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ లిమిటెడ్‌, డయాగ్నొస్టిక్‌ ల్యాబొరేటరీ, బోయినపల్లి, సికింద్రాబాద్‌
  • డాక్టర్‌ రెమిడీస్‌ ల్యాబ్‌, పంజాగుట్ట
  • అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాథాలజీ అండ్‌ ల్యాబ్‌ సైన్సెస్‌, శేరిలింగంపల్లి
  • మెడ్‌సిస్‌ పాథ్‌ల్యాబ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, న్యూబోయినపల్లి, సికింద్రాబాద్‌
  • డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ల్యాబ్‌ మెడిసిన్‌, యశోద ఆసుపత్రి, సికింద్రాబాద్‌ బీ ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రి, గచ్చిబౌలి
  • బయోగ్నొసిస్‌ టెక్నాలజిస్‌ ఇండియా, మల్కాజిగిరి
  • టెనెట్‌ డయాగ్నొస్టిక్స్‌, బంజారాహిల్స్‌
  • సెల్‌ కరెక్ట్‌ డయాగ్నొస్టిక్స్‌, విరించి ఆసుపత్రి, బంజారాహిల్స్‌ బీ కిమ్స్‌, మినిస్టర్‌ రోడ్‌, సికింద్రాబాద్‌
  • మ్యాప్‌మైజీనోమ్‌ ఇండియా లిమిటెడ్‌, మాదాపూర్‌
  • లెప్రా సొసైటీ- బ్లూ పీటర్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌, చర్లపల్లి
  • లూసిడ్‌ మెడికల్‌ డయాగ్నొస్టిక్స్‌, వాసవి నగర్‌, కార్ఖానా, సికింద్రాబాద్‌
  • ట్రూనాట్‌ విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు.. బంజారాహిల్స్‌లోని స్టార్‌ ఆసుపత్రికి అనుమతి లభించింది.

స్వల్ప లక్షణాలుంటే ఆసుపత్రుల్లో చేర్చుకోవద్దు

  • ప్రైవేటు ల్యాబ్‌ల్లో నేరుగా నమూనాలిచ్చినా, ప్రైవేటు ఆసుపత్రిలో చేరి పరీక్షలు చేయించుకున్నా.. ఒక్కో పరీక్షకు రూ.2,200 చొప్పున ధరను ప్రభుత్వం నిర్ణయించింది.
  • ల్యాబ్‌, ఆసుపత్రికి రాలేని పరిస్థితుల్లో.. బాధితుని కోరిక మేరకు వారిళ్ల వద్దనే నమూనాలు స్వీకరించవచ్చు. ఈ తరహాలో ఒక్కో పరీక్షకు ధర రూ.2,800.
  • అనుమానిత లక్షణాలున్నవారిలోనే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. నమూనాల సేకరణ మొదలు వేర్వేరు దశల్లో చికిత్స వరకూ ప్రతి అంశాన్ని ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి.
  • ఏయే చికిత్సలకు ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయో కూడా సమాచారమివ్వాలి.
  • చికిత్సల ఖరీదు, నిబంధనలను ప్రైవేటు ల్యాబొరేటరీలు, ఆసుపత్రులు అందరికీ కనిపించేలా ఉంచాలి.
  • పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారిలో.. ఎటువంటి లక్షణాలు లేకపోయినా.. అతి స్వల్ప లక్షణాలున్నా.. వారిని ఆసుపత్రుల్లో చేర్చుకోవద్దు.
  • ఐసోలేషన్‌ సౌకర్యముంటే ఇళ్లవద్దకే పంపాలి. వసతులు లేకపోతే.. ప్రభుత్వ కేంద్రానికి తరలించాలి.
  • లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని, తీవ్ర లక్షణాలు లేకున్నా ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలుంటే.. ఆ తరహా వ్యక్తులకు ఆసుపత్రుల్లో చికిత్స అందించాలి.

    ఇదీ చదవండి: కరోనా టెస్టులు, చికిత్సల ధరలను ప్రకటించిన ప్రభుత్వం

Last Updated : Jun 16, 2020, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.