ETV Bharat / city

HHF Health services : ఇంటి వద్దకే వైద్య సేవ.. మరి ఖర్చు ఎలా భరించాలి? - హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ హెల్త్

ఇంటి వద్దకే వైద్యసేవలు(Medical services at home).. కేవలం డబ్బున్న వాళ్లకే సాధ్యమవుతోంది. పేదలు అలాంటి చికిత్స చేయించుకోవాలంటే.. దానికయ్యే ఖర్చు భరించలేని పరిస్థితి. అలా అని ఆస్పత్రికి వెళ్లలేరు. ఇలాంటి వారి ఇబ్బందులను గమనించిన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్(Helping Hand Foundation).. హెచ్​హెచ్​ఎఫ్​ హెల్త్(HHF Health Services) పేరుతో అతి తక్కువ ఫీజుతో ఇంటి వద్దే సేవలు అందిస్తోంది. అవీ భరించలేని స్థితిలో ఉన్న పేదలకు ఉచితంగా వైద్యమందిస్తున్నారు.

HHF Health services
HHF Health services
author img

By

Published : Oct 18, 2021, 9:29 AM IST

ఒక నర్సు ఇంటికి వద్దకు వచ్చి సేవలు అందించాలంటే ఒక విజిట్‌కు రూ.800-1000 వరకు తీసుకుంటున్నారు. ఇక వైద్యుడే రావాలంటే ఇంకా ఎక్కువే వసూలు చేస్తున్నారు. పేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఈ ఖర్చును భరించలేని పరిస్థితి ఉంది. ఇలాంటి వారికి నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌(Helping Hand Foundation) చేదోడు వాదోడుగా నిలుస్తోంది. హెచ్‌హెచ్‌ఎఫ్‌ హెల్త్‌(HHF Health Services) పేరుతో అతి తక్కువ ఫీజుతో సేవలు అందిస్తోంది. అవీ భరించలేని పేదలకు ఉచితంగా అందించనున్నారు. వైద్యులు, టెక్నీషియన్లు, నర్సులు, ఇతర సిబ్బంది కలిసి 30-40మంది బృందం పనిచేయనుంది.

  • డాక్టర్‌ ఆన్‌ కాల్‌ లేదా విజిటింగ్‌, నర్సింగ్‌, బెడ్‌సైడ్‌ కేర్‌, ఫిజియోథెరఫీ, ల్యాబ్స్‌, డయాగ్నోస్టిక్స్‌, ఫార్మసీ, అంబులెన్సులు, వైద్య పరికరాలు, పునరావాస సంరక్షణ, ఐవి ఫ్లూయిడ్స్‌ ఎక్కించడం, ఇంజెక్టబుల్స్‌, గాయాలకు డ్రసింగ్‌, బెడ్‌ సోర్‌కేర్‌, ఫోలే కాథెటర్‌ రీప్లేస్‌మెంట్‌ తదితర సేవలు ఇందులో భాగం చేశారు.
  • పక్షవాతం, ట్రామా, డయాబెటిక్‌, గ్యాంగ్రేన్‌, సెల్యులైటిస్‌ తదితర క్లిష్ట సమస్యలకు చికిత్సలు చేయనున్నారు.

సేవలను మరింత విస్తరించనున్నాం

"అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేశాం. మున్ముందు మరింత విస్తరించనున్నాం. సేవలు పొందాలనుకుంటే హెల్ప్‌లైన్‌ నంబర్లు -73860 94042, 87121 29289."

- హసన్‌ అస్కరీ, అధ్యక్షుడు, హెచ్‌హెచ్‌ఎఫ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.