బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న తెలిపారు. ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందన్నారు. రానున్న 48 గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయంటున్న నాగరత్నతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
ఇవీచూడండి: వాతావరణశాఖ హెచ్చరిక... నాలుగు రోజులపాటు వర్ష సూచన