Rains: ఏపీలో రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావాలతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. అనేకచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురవొచ్చని పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని చెప్పారు.
ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య అత్యధికంగా విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గుల్ల సీతారామపురంలో 65.5 మిల్లీమీటర్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం రాయనపేటలో 47 మి.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, పార్వతీపురం మన్యం, కృష్ణా, వైయస్‌ఆర్, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల జల్లులు కురిశాయి.
ఇవీ చదవండి:రెడ్ అలర్ట్.. రాష్ట్రంలో నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు