ఛత్తీస్‌గఢ్ ఉత్తర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం ఉందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయన్నారు. నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. మంగళవారం పగలు కొన్నిచోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా పెద్దకొడప్‌గల్(కామారెడ్డి జిల్లా)లో 8.1, ఎంగడపల్లి(జగిత్యాల)లో 6.8, నస్పూర్(మంచిర్యాల)లో 5.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 4 డిగ్రీల వరకూ తక్కువగా నమోదయ్యాయి.
నేడు, రేపు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు...! - telangana weather report
రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.