బంగాళాఖాతం ఈశాన్య ప్రాంతంలో 5.8 కి.మీ.ల ఎత్తు నుంచి 7.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. గురువారానికి మరింత బలపడి పశ్చిమ దిశగా పయనిస్తుందని అంచనా. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 4.5 కి.మీ.ల నుంచి 7.6 కి.మీ.ల ఎత్తు వరకు గాలులు కొనసాగుతున్నాయి.
మరోవైపు మధ్యప్రదేశ్‌పై ఉన్న అల్పపీడనం బలహీనపడింది. కానీ, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో బుధవారం భారీగా, గురువారం అతి భారీగా అక్కడక్కడా వర్షాలు రాష్ట్రంలో కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్‌లో 9.6, మంగపేట (ములుగు)లో 9.6, కొల్లూరు (కామారెడ్డి)లో 9.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.