హైదరాబాద్- బెంగళూర్ జాతీయ రహదారిపై రాకపోకలకు మరోసారి అవాంతరాలు ఏర్పడ్డాయి. గగన్‌పహాడ్ వద్ద జాతీయ రహదారిపై వర్షపు నీరు వచ్చి చేరడం వల్ల ట్రాఫిక్ పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఆ మార్గం మీదుగా వాహనాలను వెళ్లనీయడం లేదు. హైదరాబాద్ నుంచి పీవీ ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా విమానాశ్రయం, బెంగళూర్ వైపు వెళ్లే వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి బెంగళూర్ వైపు వెళ్లే వాహనదారులు, బెంగళూర్ వైపు నుంచి వచ్చే వాహనదారులు బాహ్యవలయ రహదారి మీదుగా రాకపోకలు కొనసాగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. తెగిపోయిన అప్పా చెరువు కట్టను అధికారులు పునరుద్ధరించారు. మూడు రోజుల క్రితం జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
సాయంత్రం కురిసిన వర్షం వల్ల మెహదీపట్నం, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి రహదారిపై వాహనాలు రద్దీ ఏర్పడింది. వర్షం వల్ల పలు చోట్ల రహదారిపై వర్షపు నీళ్లు నిలిచాయి. వాహనాలను గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, నార్సింగి, లంగర్‌హౌజ్, నాలన్నగర్, మెహదీపట్నం మీదుగా వాహనాలను దారి మళ్లిస్తున్నారు.