ETV Bharat / city

వానగోసలు: చెరువులైన కాలనీలు... ఇబ్బందుల్లో స్థానికులు - hyderabad rains

హైదరాబాద్​లోని పలు కాలనీలు చెరువులయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమై... స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో రోజువారి పనులు చేసుకోలేక జనజీవనం స్తంభించిపోయింది.

వానగోసలు: చెరువులైన కాలనీలు... ఇబ్బందుల్లో స్థానికులు

author img

By

Published : Sep 19, 2020, 7:49 PM IST

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్​లోని పలు ప్రాంతాలు చెరువులయ్యాయి. ఎల్బీనగర్, నాగోల్, మన్సురాబాద్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, హయత్​నగర్, అబ్దుల్లాపూర్​మెట్, తుర్కయాంజల్ తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. అబ్దుల్లాపూర్​మెట్ నుంచి గండిచెరువు వెళ్లే రోడ్డు పూర్తిగా జలమయం కాగా... రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ ఛైర్మన్ మల్​రెడ్డి అనురాధ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. వర్షపు నీరు నిల్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్​కు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి: నాలాలు ఉన్నచోట.. పోలీసుల సూచనలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.