తిరుమలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో తిరుమాడవీధులు, రహదారులు జలమయమయ్యాయి. భారీ ఈదురు గాలులతో అక్కడక్కడ చెట్లు నేలకొరిగాయి. వర్షపు నీటి ప్రవాహ ఉద్ధృతికి రహదారిపై ఉన్న ద్విచక్ర వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. శ్రీవారి ఆలయ పరిసరాల్లో భారీగా వరద నీరు చేరింది. గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.
తణుకులో భారీ వర్షం...
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. నిన్నటి నుంచి వాతావరణంలో వచ్చిన మార్పులతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది. వాతావరణం ఉదయం పొడిగా ఉన్నా.. 11 గంటల సమయానికి ఒక్కసారిగా చల్లబడి భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షంతో పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
ఇదీ చదవండి: చేతికొచ్చిన పంట నీటిపాలు... అకాల వర్షంతో రైతన్న గగ్గోలు