తూర్పు మధ్య అరేబియా సముద్రం దానినాకుని ఉన్న ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు వాయుగుండంగా మారి అదే ప్రాంతంలో దక్షిణ నైరుతి దిశగా 380కిమీ, ముంబయికి పశ్చిమ వాయువ్య దిశగా 440కిమీ సలలాహ్ ( ఒమన్ ) కు తూర్పు ఈశాన్య దిశగా 1,600 కిమీ దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.
అల్ప పీడనం
ఇది రాగల 48గంటల్లో పశ్చిమ దిశగా ప్రయాణించి క్రమేపి బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 5.8కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని... మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో సుమారుగా అక్టోబర్ 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
మూడు రోజులు
మరో 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఉరుములు మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు ఈ రోజు కొన్ని చోట్లు.. రేపు ఎల్లుండి చాలా చోట్ల పడుతాయన్నారు. రాగల మూడు రోజులు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఇదీ చదవండి : వరద బాధితులకు మంత్రి కేటీఆర్ పరామర్శ