Telangana Temperature: రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచే భగ్గుమంటున్నాడు. ఫలితంగా బయట అడుగు వేస్తేనే.. నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టుగా అనిపిస్తోంది. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా... వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా జైనధ్లో అత్యధికంగా 44.9 డిగ్రీల సెల్సియస్ ఉషోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లా ఉత్తర నిజామాబాద్లో 44.8 డిగ్రీలు, జగిత్యాల జిల్లా కొల్వాయిలో 44.7, నిజామాబాద్ జిల్లాలోని మదనపల్లె, పల్దలో 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని అకెనపల్లి, జగిత్యాల జిల్లాలోని గోవిందారంలో 44.4 డిగ్రీలు, కుమురం భీం జిల్లాలోని కెరమేరి, ఆదిలాబాద్ జిల్లాలోని బోరాజ్, చప్రాలా, నిజామాబాద్ జిల్లాలోని జనకంపేట్లలో 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.