తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లపై వేసిన రిట్ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఏపీ అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు పెంచాలని పిటిషన్ దాఖలు అయింది. విభజన చట్టం నిబంధనలు అమలుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ, ఏపీ, కేంద్రం, ఈసీని ప్రతివాదులుగా చేర్చారు. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జమ్ముకశ్మీర్ నియోజకవర్గాల పిటిషన్‌కు జతచేయాలని రిజిస్ట్రీకి ఆదేశించింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి జస్టిస్ జోసఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం ఈ ఆదేశం పంపింది.
ఇవీ చదవండి: