ETV Bharat / city

కర్ఫ్యూ, 144 సెక్షన్​తో కరోనా కేసులు తగ్గుముఖం: సింఘాల్

ఏపీలో ఇప్పటి వరకు 808 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలో కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేస్తుండటంతో కరోనా కేసుల పెరుగుదల తగ్గుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని 66 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

కర్ఫ్యూ, 144 సెక్షన్​తో కరోనా కేసులు తగ్గుముఖం: సింఘాల్
కర్ఫ్యూ, 144 సెక్షన్​తో కరోనా కేసులు తగ్గుముఖం: సింఘాల్
author img

By

Published : May 29, 2021, 7:27 PM IST

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 808 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్స కోసం అవసరమైన మందులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. మే 5 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ, 144 సెక్షన్‌ అమలు చేస్తుండటంతో.. కొన్ని రోజులుగా కరోనా కేసుల నమోదు తగ్గుతోందని సింఘాల్‌ చెప్పారు.

ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్​ల సంఖ్య పెరుగుతోందన్న సింఘాల్.. మే 3న 25.56 శాతం ఉన్న పాజిటివిటీ రేటు.. ప్రస్తుతం 17.29 శాతంగా ఉందని పేర్కొన్నారు. రోజుకు లక్ష మందికి టీకా వేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని తెలిపారు. కేంద్రం కేటాయించే టీకాల లభ్యత మేరకు ఎల్లుండి నుంచి వ్యాక్సినేషన్ చేపడతామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ నిబంధనలు పాటించని 66 ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు సింఘాల్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: బ్లాక్‌, వైట్‌, ఎల్లో ఫంగస్‌ సోకిన తొలి రోగి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.