ETV Bharat / city

రెండోవరుస కరోనా వ్యాక్సినేషన్​ నమోదు ఎప్పుడు?

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ వైద్య సిబ్బందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్​ కొనసాగుతోంది. ఈనెల 25 నుంచి ప్రైవేటు వైద్యసిబ్బందికి అందించనున్నారు. వీరి తర్వాత వరుసలో ఉన్న పురపాలక, రెవెన్యూ సిబ్బంది. వచ్చే నెల రెండోవారంలో వీరికి టీకాలను అందించాలని వైద్యఆరోగ్యశాఖ భావిస్తోంది. ఈ విభాగాలకు చెందినవారి వివరాలను కొవిన్‌ యాప్‌లో పొందుపరిచే ప్రక్రియ పూర్తికాలేదు.

covid vaccine
covid vaccine
author img

By

Published : Jan 23, 2021, 9:55 AM IST

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ వైద్య సిబ్బందికి కొవిడ్‌ టీకాల పంపిణీ కొనసాగుతుండగా.. ఈనెల 25 నుంచి ప్రైవేటు వైద్యసిబ్బందికి అందించడానికి వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. వీరి తర్వాత వరుసలో నిలిచింది పురపాలక, రెవెన్యూ సిబ్బంది. అయితే ఇప్పటి వరకూ ఈ విభాగాలకు చెందినవారి వివరాలను కొవిన్‌ యాప్‌లో పొందుపరిచే ప్రక్రియ పూర్తికాలేదు. వీరితో పాటు పంచాయతీరాజ్‌ శాఖలో గ్రామీణ పారిశుద్ధ్య సేవల్లో పాల్గొంటున్న సిబ్బందికి కూడా టీకాలను అందజేయనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

ప్రారంభం కాని నమోదు ప్రక్రియ

ఈ విభాగంలో సుమారు 3 లక్షలమంది ఉంటారని అంచనా. అలాగే పోలీసు శాఖ నుంచి సుమారు లక్ష.. పురపాలక శాఖ నుంచి 45 వేలు.. పంచాయతీరాజ్‌ శాఖ నుంచి సుమారు 15 వేల సిబ్బందిని జాబితాలో చేర్చినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికి 1.60 లక్షలమందిని మాత్రమే పొందుపరచడంతో.. మిగిలిన వారి సమాచారాన్ని ఇంకా ఎప్పుడు ఆన్‌లైన్‌లో చేర్చుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా రెవెన్యూ శాఖ సిబ్బంది పేర్లు చేర్చే ప్రక్రియ ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు.

ఈనెల 25 లోగా యాప్‌లో చేర్చాలని ఆదేశం

వచ్చే నెల రెండోవారంలో వీరికి టీకాలను అందించాలని వైద్యఆరోగ్యశాఖ భావిస్తోంది. జాబితా సిద్ధం కాకపోతే.. కేంద్రాన్ని ఎన్ని టీకాలు పంపాలో అడగడం ఎలా? అని వైద్యవర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. ఈ సమస్యను వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన అత్యవసరంగా ఉత్తర్వులు జారీచేశారు. రెవెన్యూ సిబ్బంది వివరాలను ఈనెల 25 లోగా యాప్‌లో చేర్చాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు.

పొందనివారి కోసం ఒకరోజు

ప్రస్తుత టీకాల పంపిణీలో గైర్హాజరైన సిబ్బందికి ఈనెల 25న ప్రత్యేకంగా అందజేయనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. కొవిన్‌ యాప్‌లో ‘తిరస్కరణ’కు గురైన సిబ్బంది మినహా ఇతరత్రా కారణాల వల్ల హాజరు కాని సిబ్బందికి ఈ అవకాశం ఇవ్వనున్నారు. తొలి రెండు కేటగిరీలకు టీకాల పంపిణీ పూర్తయ్యాక మార్చి నుంచి 50 ఏళ్ల పైబడినవారికి, ఆలోపు వయసులో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు టీకాలను అందజేయనున్నారు. అప్పుడు పంపిణీ కేంద్రాల సంఖ్యను క్రమేణా పెంచుతామని వైద్యవర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి : చైనాలో రుణాల యాప్‌ల రూపకల్పన.. గుర్తించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.