హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్.. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్లను కలిశారు. ఉప్పల్ స్టేడియం ఆస్తి పన్నును తగ్గించి... లీజ్ సమయాన్ని పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు.
గ్రామీణ స్థాయిలో క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి... గ్రామీణ క్రీడాకారులను వెలికితీయడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పనిచేస్తోందని అజారుద్దీన్ వివరించారు. ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన మంత్రులు... ముఖ్యమంత్రితో చర్చిస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి: నవంబర్ 15 నుంచి రామగుండంలో 'కిసాన్ బ్రాండ్' యూరియా