ETV Bharat / city

'కరోనా పరీక్షా కేంద్రాల్లో దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయండి'

author img

By

Published : Aug 6, 2020, 4:34 PM IST

కరోనా పరిస్థితుల్లో దివ్యాంగులను ఆదుకోవాలన్న పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. మధ్య, తీవ్ర లక్షణాలు ఉన్న దివ్యాంగుల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జిల్లాల వారీగా కరోనా సోకిన దివ్యాంగుల వివరాలు సేకరించారించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా పరీక్ష కేంద్రాల్లో దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది.

'జిల్లాల వారిగా కరోనా బాధితుల వివరాలు సేకరించండి'

కరోనా పరిస్థితుల్లో దివ్యాంగులను ఆదుకోవాలన్న పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా బారిన పడిన దివ్యాంగుల నైపుణ్య అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య న్యాయస్థానానికి తెలిపారు. ఈ మేరకు ఆమె హైకోర్టుకు నివేదిక సమర్పించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూ.3.61 కోట్లు కేటాయించినట్లు నివేదికలో పేర్కొన్నారు. కరోనా స్వల్ప లక్షణాలున్న దివ్యాంగులకు హైదరాబాద్​ నేచర్ క్యూర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలపగా.. మధ్య, తీవ్ర లక్షణాలు ఉన్న దివ్యాంగుల పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.

జిల్లాల వారీగా కరోనా సోకిన దివ్యాంగుల వివరాలు సేకరించారించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా పరీక్షల ఫామ్​లో దివ్యాంగుల వివరాలు నమోదు చేసేలా ప్రత్యేక కాలమ్ పెట్టాలని సూచించింది. కరోనా పరీక్షా కేంద్రాల్లో దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్న ఉన్నత న్యాయస్థానం.. దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేలా వైద్య సిబ్బందికి చైతన్యం కలిగించాలని ఆదేశించింది. దివ్యాంగుల సహాయకుల ప్రయోజనాల కోసం పథకం రూపొందించే అంశాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది. నెల 23లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.

ఇవీ చూడండి: 'మూడు తరాలుగా సాగిన ఉద్యమానికి ఆయన ప్రత్యక్ష సాక్షి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.