ETV Bharat / city

'పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయించబోం'

ఆంధ్రప్రదేశ్​లోని పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని వివిధ గ్రామాల నిర్వాసితులకు ప్రత్యామ్నాయంగా పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయించబోమని ఏపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలిపింది. వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం...ఆ విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

hc-on-polavaram-compensation
'పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయించబోం'
author img

By

Published : Mar 15, 2021, 11:00 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాల్లో వివిధ గ్రామాల గిరిజన నిర్వాసితులను అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని పేర్కొంటూ దాఖలైన పిటిషన్​పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. 'శక్తి' స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ డాక్టర్ పి.శివరామకృష్ణ పిల్​ను దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది కెఎస్ మూర్తి వాదనలు వినిపించారు. పరిహారం చెల్లించకుండా..గ్రామాలు ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారన్నారు. పునరావాసం కింద ఏర్పాటు చేసిన నివాస ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. గిరిజనుల ఇళ్లను బలవంతంగా కూల్చివేస్తున్నారని తెలిపారు. అందుకు సంబంధించిన వివరాల్ని కోర్టు ముందు ఉంచారు. నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

ఏపీ ప్రభుత్వం తరపున జీపీ వాదనలు వినిపిస్తూ.. నిర్వాసితులకు ప్రత్యామ్నాయంగా పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయించబోమని హైకోర్టుకు తెలిపారు. వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... ఆ విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. పునరావాసం కల్పించకుండా గిరిజన నిర్వాసితులను గ్రామాల నుంచి ఖాళీ చేయించవద్దని అధికారులకు సూచించాలని.. ప్రభుత్వ న్యాయవాది సుమన్​కు మౌఖికంగా స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్​తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. అనంతరం విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: ఆ 33 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీస్​ ఫ్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.