హార్లీ డేవిడ్సన్ బైక్‌రైడర్స్ రామోజీ ఫిల్మ్‌సిటీలో సందడి చేశారు. బంజారా ఛాప్టర్ హార్లీ ఓనర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో... ఎనిమిదో దక్షిణ భారత హగ్ ర్యాలీ అట్టహాసంగా సాగింది. దేశవ్యాప్తంగా సుమారు 1000 హార్లీ డేవిడ్‌సన్ వాహనదారులు రైడ్‌లో పాల్గొన్నారు. నిత్యం పనిలో నిమగ్నమైన ప్రముఖ సంస్థల సీఈవోలు, ఐటీ నిపుణులు, కార్పొరేట్ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన వారంతా బైక్ రైడ్ చేస్తూ జాతీయ సమైక్యత చాటిచెప్పారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ద్విచక్రవాహనాలపై సుదూర ప్రయాణం సాగించి.. ఒక చోట చేరారు. రెప్పపాటులో దూసుకెళ్లే బైక్‌లపై సరిహద్దులు చెరిపేస్తూ సాగిపోయే.. వీరంతా తమ అనుబంధాలు గుర్తు చేసుకున్నారు. 12 నుంచి 61లక్షల రూపాయల ఖరీదైన ఈ బైక్‌లపై వేగంగా దూసుకెళ్తున్నా.. సుదూర ప్రయాణం చేసినా.. అలసట అనిపించదని చోదకులు చెబుతున్నారు. అందుకే తమందరికీ ఇష్టమైన వాహనం హార్లీ డేవిడ్సన్ అంటున్నారీ బైక్ రైడర్లు.
ఇదీ చూడండి: రామోజీ ఫిలింసిటీలో "హార్లీడేవిడ్సన్" రేసర్ల సందడి