సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన 50 పడకల ఆసుపత్రి అభివృద్ధి కోసం రూ.2.39 కోట్లు, నూతనంగా నిర్మిస్తున్న ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ భవనానికి రూ.1.17 కోట్లు విడుదల చేసేందుకు ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హరీశ్‌రావుతో జరిగిన సమావేశంలో ఈ మేరకు హామీ ఇచ్చారని తలసాని పేర్కొన్నారు.
"50 పడకల ఆసుపత్రిలో సీసీ రోడ్లు, నీటి సంపు, ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు ఆక్సిజన్ వ్యవస్థ ఏర్పాటు, పడకలు, ఫర్నీచర్, వైద్య పరికరాల కొనుగోలు కోసం రూ.2.39 కోట్లు విడుదల చేస్తామని హరీశ్‌రావు తెలిపారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనుల కోసం 57 లక్షల రూపాయలు పెండింగ్ ఉండగా వెంటనే విడుదల చేస్తామన్నారు. అదనంగా ప్రహరీగోడ, నీటి సంపు, ఫర్నీచర్ కొనుగోలు, లిఫ్ట్ ఏర్పాటు కోసం రూ.1.17 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు."
-తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి
నిధుల మంజూరుకు హామీ ఇచ్చిన ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావుకు మంత్రి తలసాని కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: పని చేస్తున్న కంపెనీకే కన్నం వేసిన ఘనులు