వేధింపులు తాళలేక మిస్సెస్ ఇండియా(2016) లక్ష్మీరావ్ సైబరాబాద్ సీపీని ఆశ్రయించారు. ఆత్మహత్యకు పాల్పడమని తిడుతున్నారని.. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని వదంతులు సృష్టించారని సజ్జనార్‌కు లక్ష్మీరావ్ వివరించారు. వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తనకు రక్షణ కావాలని లక్ష్మీరావ్ కోరగా.. సీపీ సజ్జనార్ సానుకూలంగా స్పందించారన్నారు. మరోసారి స్త్రీలపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్ నల్లగండ్లలో లక్ష్మీరావ్, తన భర్త ఇద్దరు పిల్లలతో ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న అసోసియేషన్ సభ్యులు అతుల్ సింగ్, శ్రీజిత్, సిద్దార్థ అనే ముగ్గురు వేధింపులకు గురి చేస్తున్నారని గచ్చిబౌలి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సజ్జనార్‌ను ఆశ్రయించారు.
"నా వృత్తి వ్యాపారాలలో నిత్యం బిజీగా ఉంటుంటాను. స్వతహాగా ఎదుగుతున్న నన్ను ఓర్వలేక నా తోటి అపార్ట్మెంట్ వాసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 'ఆవాజ్' సంస్థ ద్వారా యాంటీ సూసైడ్ క్యాంపెయిన్ రన్ చేసిన నాపై సూసైడ్ వదంతులు ప్రచారం చేస్తున్నారు. దీనిలో ఉన్న మతలబు ఏంటో అర్థమవట్లేదు. గతంలో నా ఆడి కార్‌ను ధ్వంసం చేసి నాకు 6 లక్షల వరకు నష్టం కలిగించారు. ఇప్పుడూ ఈ ఆత్మహత్య పుకార్లతో నన్ను ఏం చేస్తారో తెలియట్లేదు."
-లక్ష్మీరావ్, మిస్సెస్ ఇండియా(2016)
ఇదీ చూడండి: బిహార్ ప్రజాతీర్పు: నేడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..