ETV Bharat / city

అంగవైకల్యాన్ని అధిగమించారు.. పర్వతాలు అధిరోహించారు - ఆర్యవర్ధన్‌

తల్లిదండ్రులు తిట్టారనో, పరీక్షల్లో ఫెయిల్​ అయ్యామనో... చిన్నచిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు నేటితరం. కానీ ప్రమాదంలో ఒక కాలు కోల్పోయినా చెరగని ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధించాలనే తపనతో అంగవైకల్యాన్ని అధిగమించారు ఆ యువకులు. సాధించాలనే పట్టుదల, కృషి ఉంటే ఏదైనా చేయవచ్చని నిరూపించారు. అంగవైకల్యాన్ని అధిగమించి మౌంట్ గంగోత్రి, భగీరథ్ పర్వతాలను అధిరోహించారు.

అంగవైకల్యం అధిగమించారు... పర్వతాల్ని అధిరోహించారు...
author img

By

Published : Sep 3, 2019, 11:53 AM IST

అంగవైకల్యం అధిగమించారు... ఎవరెస్టు అధిరోహించారు...

ప్రపంచంలో ఎత్తైన మౌంట్‌ గంగోత్రి, భగీరథ్‌ పర్వతాలను తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు దివ్యాంగులు అధిరోహించారు. సాధించాలనే పట్టుదల ఉంటే చాలు అంగవైకల్యం అడ్డురాదని నిరూపించారు. దిల్‌సుఖ్‌నగర్​కు చెందిన 17 ఏళ్ల ఆర్యవర్ధన్‌, ఆంధ్రప్రదేశ్​కు చెందిన 22 ఏళ్ల అర్షద్‌ షేక్‌ రోడ్డు ప్రమాదంలో తమ ఎడమ కాళ్లు కోల్పోయారు. అయినా ధైర్యం కోల్పోలేదు. పర్వాతారోహణపై ఆసక్తితో ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ ద్వారా పర్వతాలు అధిరోహించడంలో శిక్షణ పొందారు. అర్షద్‌ జాతీయ స్థాయి సైక్లింగ్‌ పోటీల్లో కూడా పాల్గొన్నాడు.

అడుగడుగునా అవాంతరాలే...

కృత్రిమ అవయవాలు అమర్చుకున్న వీరిద్దరూ జులై 17న గంగోత్రి, మౌంట్‌ భగీరథ్‌ శిఖరారోహణకు బయలుదేరారు. ఆగస్టు 29న 18వేల అడుగుల ఎత్తున్న శిఖరాల పై భాగానికి చేరుకున్నారు. అడుగడుగునా అవాంతరాలు ఎదురైనా లక్ష్య సాధన దిశగా ముందుకు సాగారు. అనుకున్నది సాధించారు.

పోలీసుల ఘన స్వాగతం...

మౌంట్‌ గంగోత్రి, భగీరథ్‌ పర్వతాలను అధిరోహించిన ఆర్య, అర్షద్​లు ఈరోజు హైదరాబాద్​కు చేరుకున్నారు. వీరికి సికింద్రాబాద్, గోపాలపురం స్టేషన్ల పోలీస్ అధికారులు సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో ఘన స్వాగతం పలికారు. పూలమాలలతో, శాలువాతో సత్కరించి అభినందించారు.

అంగవైకల్యం లక్ష్య సాధనకు అడ్డుకాదని, భవిష్యత్​లో మరిన్ని పర్వతాలు అధిరోహిస్తామంటున్న ఆర్య, అర్షద్​లు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారి తదుపరి లక్ష్యం మౌంట్ ఎవరెస్ట్ త్వరలోనే అధిరోహించాలని కోరుకుందాం.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.