House arrest: ఏపీ కర్నూలులో దివ్యాంగురాలు సుభద్రబాయిని పోలీసులు గృహనిర్బంధించారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా ఆమెను ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. సీఎం గత పర్యటన సందర్భంగా జగన్‌ను కలిసిన సుభద్రబాయ్‌కి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా అప్పటి కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు ఆమెకు ఎలాంటి ఉద్యోగం ఇవ్వకపోవడంతో.. నేడు మరోసారి సీఎం జగన్‌ను కలిసేందుకు ఆమె సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు ఆమెను గృహనిర్బంధించారు.
ఇదీ చదవండి: Bandi Sanjay Letter To Kcr: 'సాగునీటి ప్రాజెక్టులపై చర్చిద్దాం పాలమూరుకు రండి'