Half day schools in Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులుంటాయి. కొన్ని ఉపాధ్యాయ సంఘాల వినతి నేపథ్యంలో గతంలో మాదిరిగానే ఒంటిపూట బడులు నడపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ క్రమంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ప్రతిపాదనలు పంపారు. పదో తరగతి పరీక్షలు మే 20వ తేదీ వరకు జరగనున్నందున ఈ విద్యా సంవత్సరానికి అదే చివరి పనిదినం కానుంది.
ఇవీచూడండి: TET Exam: టెట్ గట్టెక్కేదెట్లా?.. బయాలజీ, భాషాపండితులకు గణిత భారం