ETV Bharat / city

విద్యార్థులకు గుడ్​న్యూస్​.. ఆ పరీక్షలకు మరో అరగంట అదనం - విద్యార్థులకు గుడ్​న్యూస్​.. ఆ పరీక్షలకు మరో అరగంట అదనం

విద్యార్థులకు గుడ్​న్యూస్​.. ఆ పరీక్షలకు మరో అరగంట అదనం

author img

By

Published : Apr 7, 2022, 1:54 PM IST

13:49 April 07

విద్యార్థులకు గుడ్​న్యూస్​.. ఆ పరీక్షలకు మరో అరగంట అదనం

మే నెలలో జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులను మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యా సంచాలకుల కార్యాలయంలో అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో బుధవారం ఆమె సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభం అయినందున.. ఈసారి 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పరీక్ష సమయాన్ని అర గంట పెంచినట్లు వివరించారు. మొత్తం సిలబస్‌లో 70 శాతంలోనే ప్రశ్నలుంటాయని.. అధికంగా ఛాయిస్‌ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి, పరీక్షలు సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి: TS SSC Exams: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ మార్పు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.