ETV Bharat / city

ప్రజాప్రతినిధులకు ఎలా సోకింది? : పీసీసీ నేత గూడూరు - గూడూరు నారాయణ రెడ్డి తాాజా వార్తలు

రాష్ట్రంలో కరోనా వైరస్​ సమూహ వ్యాప్తి లేదనడం సరికాదని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎలాంటి ప్రయాణ చరిత్రలేని ఇద్దరు నేతలకు పాజిటివ్​ రావడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో సమూహ వ్యాప్తి లేకుండా వైరస్​ ఎలా సోకిందని ప్రభుత్వాన్ని నిలదీశారు. కొవిడ్ కమ్యూనిటీ ట్రాన్​మిషన్‌పై తెలంగాణ ప్రభుత్వం మౌనం వీడాలని డిమాండ్‌ చేశారు.

ప్రజాప్రతినిధులకు వైరస్​ ఎలా సోకింది?: గూడూరు

author img

By

Published : Jun 14, 2020, 6:42 AM IST

రాష్ట్రంలో కొవిడ్​ సోకిన వారి సంఖ్య తక్కువగా చూపించే ప్రయత్నం చెయ్యడం ద్వారా రాబోయే రోజుల్లో మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉందని కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్​) నిర్వహించిన సర్వే ఫలితాలతో 'కమ్యూనిటీ ట్రాన్స్మిషన్' జరగలేదని చెప్పడానికి వీల్లేదని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిర్దేశిత ప్రాంతాల్లో కేవలం రెండు రోజులు మాత్రమే సర్వే చేసి.. తక్కువ సంఖ్యలో నమూనాలు సేకరించారన్నారు. ఈ సర్వే ఫలితాలను మొత్తం తెలంగాణ రాష్ట్రానికి వర్తింపచేయడం సరికాదన్నారు.

లాక్​డౌన్​ సడలించిన తరువాత రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరగడం మొదలైందన్నారు. కొవిడ్ సమూహ వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం మౌనం వీడాలని డిమాండ్‌ చేశారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న కేసులు కరోనా సమూహ వ్యాప్తి దశలోకి ప్రవేశించిందన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి మూడో దశలోకి ప్రవేశించిందో? లేదో? రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చెయ్యాలన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకి, బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేకి కూడా కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిందని, ఎలాంటి ప్రయాణ చరిత్ర లేని వీరికి వైరస్​ ఎలా సోకిందని ప్రశ్నించారు.

వాస్తవాలను దాచడం ద్వారా కరోనా వైరస్ నివారణలో ఫలితాలు రావని, ముందు వాస్తవికతను అంగీకరించడం ప్రభుత్వం అలవర్చుకోవాలన్నారు. కరోనా పరీక్షల వాస్తవ సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రోజులు దాచలేదని, కేసీఆర్ ప్రభుత్వం జవాబుదారీగా, బాధ్యతగా ఉండడం నేర్చుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి: 'ఒకే సరిహద్దు- ఒకే సైన్యం విధానం మనకూ అవసరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.