రాష్ట్రంలో పాత్రికేయులకు బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆరోగ్యాన్ని, జీవితాలను పణంగా పెట్టి జర్నలిస్టులు పనిచేస్తున్నారని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి అన్నారు.
మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో చాలా మంది పాత్రికేయులు కరోనా వైరస్ బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. హర్యానా ప్రభుత్వం ఒక్కో పాత్రికేయునికి రూ.10 లక్షల బీమా రక్షణ ప్రకటించిందని ఆయన తెలిపారు. పశ్చిమ బంగా ప్రభుత్వం అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు భీమా పథకాన్ని విస్తరించిందని ఆయన వివరించారు.
వందలాది మంది రిపోర్టర్లు, కెమెరా పర్సన్లు, ఫొటో గ్రాఫర్లు, డెస్క్ సభ్యులు, న్యూస్ యాంకర్లు పని చేస్తారని.. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో పాలుపంచుకునే వీరందరికి భీమా కల్పించి వారి సేవలను గుర్తించాలని డిమాండ్ చేశారు.