ETV Bharat / city

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి.. కారణాలు తెలియక లక్షణాల మేరకు చికిత్స - ఏలూరులో అంతుచిక్కని వ్యాధి

ఏపీలోని ఏలూరులో అస్వస్థతకు గురవుతున్న బాధితుల సంఖ్య రెండు రోజుల నుంచి భారీగా పెరుగుతోంది. నగరంలోని పది ప్రాంతాలకు చెందినవారు స్పృహ కోల్పోవటం, మెడ, నడుంనొప్పి, తల, కళ్లు తిరగడం, వంటి లక్షణాలతో శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రిపొద్దు పోయే వరకు ఆసుపత్రులకు వస్తూనే ఉన్నారు. వారు చెబుతున్న లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స అందిస్తుండటంతో బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు.

growing-number-of-victims-in-eluru
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి.. కారణాలు తెలియక లక్షణాల మేరకు చికిత్స
author img

By

Published : Dec 7, 2020, 5:43 AM IST

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురవుతున్న బాధితుల సంఖ్య రెండు రోజుల నుంచి భారీగా పెరుగుతోంది. నగరంలోని పది ప్రాంతాలకు చెందినవారు స్పృహ కోల్పోవటం, మెడ, నడుంనొప్పి, తల, కళ్లు తిరగడం, వంటి లక్షణాలతో శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రిపొద్దు పోయే వరకు ఆసుపత్రులకు వస్తూనే ఉన్నారు. వారు చెబుతున్న లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స అందిస్తుండటంతో బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు. అయితే ఒక్కసారి ఇంతమంది ఇలా అస్వస్థతకు గురవడానికి కారణాలేమిటో ఇప్పటికీ స్పష్టత రాలేదు. బాధితుల రక్త నమూనాలు, వారి ఇళ్ల పరిసరాల్లోని నీటి నమూనాలను విజయవాడ వైద్య కళాశాల ప్రయోగశాలలో పరీక్షించగా ‘నెగెటివ్‌’ అని వచ్చింది. నీటి నమూనాల్లో ప్రమాణాలు కూడా కచ్చితంగానే ఉన్నాయని పరీక్షల్లో తేలినట్లు వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రభావిత ప్రాంతాల్లో పాల నమూనాలను కూడా సేకరించి పరీక్షలకు పంపారు. మరోవైపు.. నీటిలో జంతువుల అవశేషాలు కలవడం వల్ల లేదా ఎవరైనా నీటిని విషపూరితం చేయడం వల్ల ఇలా జరిగిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరింత లోతుగా పరీక్షలు చేసేందుకు హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) సహాయం కోరుతూ వైద్య, ఆరోగ్య శాఖ ఆయా సంస్థలకు లేఖ రాసింది.

నాలుగైదు రోజుల నుంచే..
ఏలూరులోని వివిధ ప్రాంతాలకు చెందిన కొందరు పై లక్షణాలతో నాలుగైదు రోజులుగా ప్రైవేట్‌ ఆసుపత్రులకు, స్థానిక వైద్యుల వద్దకు వచ్చి చికిత్స చేయించుకున్నారు. కాసేపటికే తేరుకుని వెళ్లిపోవడంతో విషయం వెలుగులోకి రాలేదు. ప్రభుత్వాసుపత్రికి ఒకట్రెండు కేసులు వచ్చినా వారిని సాధారణ రోగులుగానే భావించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి రోగుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో అప్రమత్తమైన వైద్యులు బాధితుల నుంచి రక్త నమూనాలు, వారి ఇళ్ల పరిసరాల నుంచి నీటి నమూనాలు సేకరించారు. వాటిని పరీక్షించినా కారణాలేమీ తెలియలేదు. నీటి నమూనాలను 48 గంటలపాటు పరీక్షిస్తే (కల్చర్‌) బ్యాక్టీరియాలజికల్‌ ప్రభావం ఉందేమో తెలుస్తుందని వైద్యులు పేర్కొన్నారు. దీని ఫలితం కోసం ఎదురుచూస్తున్నామని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌ మంజరి పేర్కొన్నారు. బాధితుల్లో అత్యధికులకు అంతకుముందు ఎటువంటి రోగాలు లేవని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ గీతాప్రసాదిని చెప్పారు. మూర్ఛ తీవ్రంగా ఉంటే బాధితుల మెదడుపై తీవ్ర ప్రభావం కనిపిస్తుందని, ఇక్కడ అటువంటి లక్షణాలతో ఎవరూ లేరని అన్నారు.

కలుషితాల వల్లేనా?
దోమల నియంత్రణకు చల్లే మందులు మంచినీటి ట్యాంకుల దగ్గర నీటిలో చేరినా ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉండొచ్చని వైద్యులు అంటున్నారు. ఆర్సెనిక్‌, లెడ్‌ తదితర భార లోహాలు నీటిలో త్వరగా కలిసిపోయి దాన్ని కలుషితం చేస్తాయి. అయితే బాధితుల్లో ఎవరికీ జ్వరం, విరేచనాలు, వాంతులు, ఇతర లక్షణాలు కనిపించలేదని వైద్యులు తెలిపారు. డెంగీ, మలేరియా, చికున్‌గన్యా పరీక్షలు నిర్వహించినప్పటికీ ఏమీ తేలలేదని సీనియర్‌ వైద్యులు చెప్పారు. నీరు, పాలు, ఆహార పదార్థాల్లో విషతుల్యాలు కలిసి ఉంటే.. దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉండేదని పశ్చిమగోదావరి జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు ఏవీఆర్‌ మోహన్‌ అభిప్రాయపడ్డారు. ఏలూరు పరిసరాల్లో జూట్‌మిల్లు మినహా పరిశ్రమలు లేవు. అయితే నగరంలోని తమ్మిలేరు కాలువ, కృష్ణా కాలువల్లో రకరకాల వ్యర్థాలు కలుస్తున్నాయి. దీంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అక్కడి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపుతున్నారు.

ఇదీ చదవండి : 'భారత్​ బంద్​లో మా శ్రేణులు పాల్గొంటారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.