ETV Bharat / city

కాళేశ్వరంతో భారీగా పెరిగిన భూగర్భ జలమట్టం - kaleawaram water level

కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భ జలమట్టం భారీగా పెరిగిందని భూగర్భ జలవనరుల శాఖ నివేదిక పేర్కొంది. ప్రాజెక్టు పరిధిలో 14 శాతం భూగర్భ జలాలు చాలా తక్కువ లోతులోనే ఉన్నాయని పేర్కొంది. గత దశాబ్ద కాలంగా ఇప్పుడే భూగర్భ జలమట్టం భారీగా పెరిగిందని నివేదిక పేర్కొంది.

kaleswaram
కాళేశ్వరంతో భారీగా పెరిగిన భూగర్భ జలమట్టం
author img

By

Published : Jul 16, 2020, 7:20 AM IST

కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది. జూన్ నెలకు సంబంధించి సంబంధిత శాఖ నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రాజెక్ట్ ప్రాంతంలోని 14 శాతంలో నీటి లభ్యత చాలా తక్కువ లోతులోనే ఉన్నాయి. 2083 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదు మీటర్ల లోపు, ఐదు నుంచి పది మీటర్ల మధ్యలోనే ఉన్నాయి. నిరుడు ఈ పరిమాణం కేవలం నాలుగు శాతం అంటే 675 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ప్రాజెక్టు పరిధిలో పది మీటర్ల లోపు భూగర్భ జలాలు ఉండే ప్రాంతం గత ఏడాదితో పోలిస్తే 1408 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. ఇదే సమయంలో భూగర్భజలాలు లోతుగా ఉండే ప్రాంతం 32 శాతం మేర తగ్గింది. గత దశాబ్ద కాలంగా ఇప్పుడే భూగర్భ జలమట్టం భారీగా పెరిగిందని నివేదిక పేర్కొంది.

జూన్​లో 2 జిల్లాల్లోనే తక్కువ వర్షపాతం

నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రభావంతో భూగర్భ జలమట్టం బాగా పెరిగిందని తెలిపింది. జూన్ నెల చివరి వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 34 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మొత్తం 33 జిల్లాలకు గాను 26 జిల్లాల్లో అధిక, ఐదు జిల్లాల్లో సాధారణ, రెండు జిల్లాల్లోనే తక్కువ వర్షపాతం నమోదైంది. 589 మండలాల్లో 375 మండలాల్లో అధిక, 137 మండలాల్లో సాధారణ, 73 మండలాల్లో తక్కువ, నాలుగు మండలాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదైనట్లు భూగర్భ జలవనరుల శాఖ తెలిపింది.

సిరిసిల్లలో మీటర్ లోతులోనే భూగర్భజలాలు

జూన్​లో రాష్ట్రంలో భూగర్భ జలాలు సగటున 10.75 మీటర్ల లోతులో ఉండగా... నిరుడు జూన్​లో 14.40 మీటర్ల దిగువన ఉన్నట్లు పేర్కొంది. 3.65 మీటర్ల మేర పెరుగుదల నమోదైంది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో కేవలం 0.78 మీటర్ల దిగువనే భూగర్భజలాలు ఉండగా... నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం కుదా భక్షపల్లి గ్రామంలో అత్యంత లోతులో 54.77 మీటర్ల లోతులో ఉన్నాయి. మే నెలతో పోలిస్తే రాష్ట్రంలో భూగర్భ జలాల పరిమాణం 50 టీఎంసీలు పెరిగినట్లు భూగర్భ జలవనరుల శాఖ పేర్కొంది.

రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కింద చెరువులు నింపు తుండడంతో ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పెరుగుతోందని నివేదిక స్పష్టం చేసింది.

ఇవీచూడండి: ఎడతెరిపిలేని వానలు.. చెరువులను తలపించిన ఉస్మానియా ఆస్పత్రి వార్డులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.