ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు హైదరాబాద్లో తెరాస శ్రేణులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇవాళ నాంపల్లి నియోజకవర్గంలో తెరాస ఇంఛార్జి ఆనంద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సరకులు పంపిణీ చేశారు.
నగరంలో కొనసాగుతున్న లాక్డౌన్తో పనులు కొనసాగక నిత్యావసర సరకులు కొనుగోలు చేయలేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 300 నిరుపేద కుటుంబాలకు బియ్యం, పప్పులు, కూరగాయలు, చింతపండు అందజేశారు.
ఇవీచూడండి: తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య