ETV Bharat / city

గోషామహల్​లో నిత్యావసరాల పంపిణీ - జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు నిత్యావసరాల పంపిణీ

హైదరాబాద్​లోని గోషామహల్​ నియోజకవర్గంలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం, స్వీయ నిర్బంధం పాటించాలని సూచించారు.

groceries distribution in goshamahal by national sc commission member ramulu
గోషామహాల్​లో నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : May 2, 2020, 6:44 PM IST

లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు, వలస కూలీలకు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. జేపీ నడ్డా పిలుపు మేరకు గోషామహల్​ నియోజకవర్గంలోని స్వామి దయానంద్​ నగర్​, ఓం నగర్​లో 300 మందికి అందజేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భాజపా కార్యకర్తలు అండగా నిలిచారన్నారు.

ఆపదలో కూడా ప్రజలను ఆదుకోవడంలో ముందు నిలవడం ఆనందంగా ఉందని రాములు అన్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం, స్వీయ నిర్బంధం పాటించాలని కోరారు. కార్యక్రమంలో భాగ్యనగర్​ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్​ రావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​పై మంత్రి కేటీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.