ఇంట్లో పండుగ చేసుకోవడం మామూలు. కానీ శ్మశానంలో చేయడం చాలా ప్రత్యేకం. అక్కడికి వెళ్లాలంటేనే.. ఏదో భయం. కృష్ణా జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం గ్రామస్థుల ఏటా నవంబర్ 2వ తేదీన శ్మశానంలో పండుగ చేసుకుంటారు. రెండు రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ శివారు సితాయలంక గ్రామంలో క్రిస్టియన్ శ్మశాన వాటికలో గ్రామంలో ఉన్న వారంతా కలిసి ఏటా నవంబరు 2న పండుగ చేసుకొంటారు. ఈ ఏటా అలానే నిర్వహించారు. శ్మశానంలో రెండు రోజుల ముందు నుంచే ముళ్ల పొదలు తొలగించారు. సమాధులకు రంగులు వేసి, మట్టితో అలికి, రంగులతో అలంకరించారు. వారికి ఇష్టమైన తినుబండారాలు సమాధుల దగ్గర ఉంచి వాటిని ప్రసాదంగా స్వీకరించారు. సమాధుల దగ్గర బాణాసంచా కాల్చారు. గ్రామానికి చెందిన వారు దేశ విదేశాల్లో ఉన్నా... ఈ పండుగ కోసం ఏటా వస్తారు.
ఇలా ఎందుకు చేస్తారంటే?
చిన్న చిన్న తప్పులు చేసిన వారు స్వర్గానికి... నరకానికి వెళ్లకుండా మధ్యలో ఉండిపోతారు. వారి ఆత్మలు ప్రభువు సన్నిధికి చేరేందుకు ఈ వేడుకలు నిర్వహిస్తాం. ఈ మృతుల సంస్మరణ దినోత్సవం కోసం.... శ్మశానాన్నిముస్తాబు చేస్తాం. చిన్నారుల నుంచి ముసలిముతకా రెండు రోజుల పాటు కష్టపడ్డారు.
- విజయ్ కుమార్, రోమన్ కేథలిక్ చర్చి ఫాదర్
ఇదీ చదవండి:ఒక్కటిచ్చానంటే చూడు.. ముక్కు పగిలిపోద్ది!