ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 9.45 గంటలకు దేవస్థానం ఈఓ కె.ఎస్. రామారావు, అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. చండీశ్వరునికి కంకణధారణ చేసి మంగళహారతులు సమర్పించారు.
అర్చకులు, వేదపండితులకు ఈఓ రామారావు దీక్షా వస్త్రాలను అందజేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో త్రిశూలపూజ, భేరిపూజ చేసి సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఆవిష్కరించనున్నారు.
ఇదీ చదవండి: బీమా కోసం హత్యలు.. ఛిద్రమవుతున్న కుటుంబాలు